కొండ నిండా భక్తజనం | - | Sakshi
Sakshi News home page

కొండ నిండా భక్తజనం

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4గంటలు, అతిశీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement