చదవాలంటే నడవాల్సిందే | - | Sakshi
Sakshi News home page

చదవాలంటే నడవాల్సిందే

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

రుద్రవరం: మండలంలోని పలు గ్రామాల విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. చదువుకోవాలంటే కి.మీ.ల దూరం నడవాల్సి వస్తోంది. ముత్తలూరు, చిత్రేనిపల్లె, పెద్దకంబలూరు గ్రామాల్లోని విద్యార్థులకు ఈ దుస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు మాత్రమే చదివే అవకాశం ఉండటంతో ఆ తర్వాత 6వ తరగతి నుంచి చదివేందుకు 1 కి.మీ నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోజూ విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కాగా ఈ ఏడాది పాఠశాలలు తెరిచి నెల గడిచినా ఇప్పటి వరకు విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయకపోవడంతో ఒట్టి కాళ్లతో నడక సాగిస్తున్నారు. ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మిని వివరణ కోరగా.. బూట్లు మండల కేంద్రం రుద్రవరానికి వచ్చాయని, సైజుల వారీగా వేరు చేసి పాఠశాలలకు తరలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement