దొరకని పసికందు ఆచూకీ
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామాని కి చెందిన బుగ్గానిపల్లె ఎల్లాలక్ష్మి (23), వైష్ణవి (3), సంగీత (మూడు నెలల శిశువు) గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఈ నెల 28వ తేదీన ఎస్సార్‌బీసీ కాల్వలో దూకి ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి, పెద్దకూతురి మృతదేహాలను గుర్తించి బయటకు తీయగా శిశువు సంగీత కోసం సహాయక బృందాల గాలింపు బుధవారం కొనసాగింది. ఘటనపై ఎల్లా లక్ష్మి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు బాధితురాలి భర్త రమణయ్యతో పాటు అత్త నాగలక్ష్మి, ఆడపడుచు భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శిశువు ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు సీఐ చెప్పారు.
ముగతి పేటలో భారీ చోరీ
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ముగతి పేటలో సొసైటీ రిటైర్డ్ సెక్రటరీ ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిిసింది. ముగతి పేటకు చెందిన రిటైర్డ్ సెక్రటరీ శ్రీనివాసులు గత నెల 26వ తేదీన ఇంటికి తాళం వేసి గుల్బార్గాలోని తన కుమారుడి దగ్గరకు వెళ్లాడు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం ఇంటికి రాగా తాళం విరగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేల నగదును దొంగలు చోరీకి పాల్పడినట్లు యజమాని శ్రీనివాసులు చెప్పారు. పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దొరకని పసికందు ఆచూకీ


