ఎన్‌ఎస్‌పీ భూముల్లో అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌పీ భూముల్లో అక్రమ నిర్మాణాలు

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

నోటీసులు ఇచ్చాం

లోయుక్త ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చాం. వారి నుంచి స్పందన ఆధారంగా మరోసారి నోటీసులు జారీ చేస్తాం. అనంతరం అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు చర్యలు తీసుకుంటాం.

– ఉమాదేవి, తహసీల్దార్‌, నేరెడుగొమ్ము

చందంపేట : నేరెడుగొమ్ము మండలంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) అవసరాల కోసం కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌పీ భూముల పరిరక్షించేందుకు కొందరు లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన లోకాయుక్త వెంటనే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

అనుమతులు లేకుండా..

నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌ కాలనీలో సాగర్‌ వెనుక జలాలను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) ల్యాండ్‌ సర్వే నంబర్‌ 134లోని 8.34 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఒకే రైతు పేరుమీద పట్టా అయ్యింది. అయితే ఈ భూమిని కేవలం సాగు చేసుకోవాలి కానీ ఎలాంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదు. ఈ భూమిలో 2.26 ఎకరాలను పట్టా ఉన్న రైతు నుంచి కొందరు వ్యక్తులు అక్రమమార్గంలో కొనుగోలు చేశారు. అనంతరం వాటిని ప్లాట్లుగా చేసి ఇతరులకు విక్రయించడంతో వారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలకు తెర లేపారు. ఇలా ఒకరిని చూసి మరొకరు నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అవసరాల కోసం కేటాయించిన భూములు ప్రభుత్వ లేదా నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవిగా రికార్డుల్లో నమోదైన ఉన్నాయి. ప్రధాన కాలువలు, ఉపకాలువలు, నీటి నిర్వాహణ, నిర్మాణాల కోసం ఈ భూములు కేటాయించబడ్డాయి. ఈ భూములను సాగు చేస్తున్నంత మాత్రాన పట్టా హక్కు రాదు. కాగా ఈ భూములను సంబంధిత ప్రాజెక్టు శాఖకు చట్టబద్ధమైన హక్కు ఉన్న భూములను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో అనుమతి లేకుండా సాగు చేయడం, ఇళ్లు నిర్మించడం లేదా ఇతర అవసరాలకు వినియోగించరాదు.

లోకాయుక్త ఆదేశాలతో నోటీసులు జారీ

నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌ కాలనీలో గల ఎన్‌ఎస్‌పీ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చాలంటూ లోకాయుక్త ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మండల రెవెన్యూ అధికారులు సంబంధిత అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. 20 రోజులు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠ నెలకొంది.

ఫ వైజాగ్‌ కాలనీలో ప్రాజెక్టు కోసం 8.34 ఎకరాలు కేటాయింపు

ఫ ఇందులో 2.26 ఎకరాలు

అమ్ముకున్న ఓ రైతు

ఫ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన కొనుగోలుదారులు

ఫ ప్రజా ఫిర్యాదు మేరకు

కూల్చాలంటూ

లోకాయుక్త ఉత్తర్వులు

ఫ నోటీసులు అందజేసి 20 రోజులు

అవుతున్నా చర్యలు శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement