రామగిరి (నల్లగొండ) : నేటి పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే విజేతలుగా నిలిచి ఉజ్వల భవిష్యత్ దక్కుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీపై పాఠకులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రంథాలయానికి మరిన్ని కంప్యూటర్లు మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ మాట్లాడుతూ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న డిజిటల్ లైబ్రరీ సేవలను పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి, లైబ్రేరియన్ ఆర్.కుసుమశ్రీ, సీనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్, జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ కె.సృజనరావు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్‌ఖాన్


