రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో కార్తీక పూజలు | - | Sakshi
Sakshi News home page

రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో కార్తీక పూజలు

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

కనగల్‌ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కనగల్‌ మండలం దర్వేశిపురం (పర్వతగిరి) స్టేజ్‌ వద్ద గల శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయానికి భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కార్తీక పూజలు నిర్వహించి మొక్కుబడి కల్యాణాలు, కుంకుమ అభిషేకాలు జరిపించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలయ అర్చకులు అమ్మవారిని నిమ్మకాయలతో, పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. పూజల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ చీదెటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్‌కుమారాచార్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో

నిత్యకల్యాణ వేడుక

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, గర్భాలయంలో స్వయంభూ మూర్తులను అభిషేకించారు. ఆలయ ముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రథమ ప్రకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఊరేగించారు.

సాగర్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డైరెక్టర్‌ జనరల్‌

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజర్షి ద్వివేది కుటుంబ సమేతంగా సందర్శించారు. శనివా రం రాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకున్న వీరు ఆదివారం నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యాం, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. బుద్ధవనంలోని బుద్ధుడి పా దాల చెంత పుష్పాంజలి ఘటించారు. ధ్యానమందిరంలో బుద్ధవనం ఎస్టేట్‌ ఆఫీసర్‌ రవి చంద్రారెడ్డి వారిని సత్కరించారు. నాగార్జున కొండపై యజ్ఞశాల, మహాస్థూపం, సింహళీ విహారం, మ్యూజియంలో బుద్ధుడి ధాతువులను పరిశీలించారు. వీరివెంట టూరిజం గైడ్‌ సత్యనారాయణ, మ్యూజియం క్యూరేటర్‌, పురావస్తుశాఖ మ్యూజియం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కమలహాసన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement