నిమజ్జనానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి సిద్ధం

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

బారికేడ్లు, క్రేన్ల ఏర్పాటు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి అడ్డు నల్లగొండలో రోడ్లకు మరమ్మతు

నిమజ్జనానికి వసతులు

సమకూరుస్తున్నాం

నల్లగొండ టూటౌన్‌ : వినాయక నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల 23వ తేదీన గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర కోసం నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 10 ఫీట్లలోపు ఉన్న విగ్రహాలను ఆర్జాలబావి వల్లభరావు చెరువులో, 10 ఫీట్లకు పైన ఉన్న వాటిని ఎడమ కాల్వ 14వ మైలు, వేములపల్లి వద్ద నిమజ్జనం చేయనున్నారు. శోభాయాత్ర ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌, విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేయగా.. ఒక్క నల్లగొండ నగరంలోనే 563 విగ్రహాలు ఉన్నాయి.

నల్లగొండలో ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆర్జాలబావి వల్లభరావు చెరువ వద్ద బారికేడ్లు, క్రేన్లు, లైటింగ్‌, మైకులు, షామియానా, తాగునీరు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు సుమారు రూ.75 లక్షలతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. వల్లభరావు చెరువు వద్ద మూడో రోజు నుంచే విగ్రహాలను నిమజ్జనం చేస్తుండడంతో రెండు క్రేన్లను ఉంచారు.

నల్లగొండలోని దేవరకొండ రోడ్డు సెయింట్‌ ఆల్ఫోన్సెస్‌ స్కూల్‌ వద్ద నిర్మిస్తున్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి భారీ విగ్రహాలకు అడ్డు తగులనుంది. బ్రిడ్జి వద్ద 20 ఫీట్ల ఎత్తు ఉండడంతో భారీ విగ్రహాలు వెళ్లే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దాంతో వన్‌టౌన్‌ పరిధిలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌ ఒకటో నంబర్‌ విగ్రహం నుంచి ప్రారంభం కానున్న శోభాయాత్ర నుంచి వచ్చే భారీ విగ్రహాలు, టూ టౌన్‌ ప్రాంతంలోని భారీ విగ్రహాలు కూడా వేములపల్లి వద్ద ఉన్న సాగర్‌ ఎడమకాల్వలో నిమజ్జనం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. గడియారం సెంటర్‌ నుంచి పానగల్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వరకు గుంతలు పూడ్చి ప్యాచ్‌ వర్క్‌ చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో శోభాయాత్రకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేస్తున్నారు. పాతబస్తీలో కొత్త విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు.

గణేష్‌ నిమజ్జనం, శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. శోభాయాత్ర జరిగే మార్గంలో మంచినీటి సౌకర్యం, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా వసతులు సమకూరుస్తున్నాం.

– వంశీకృష్ణ, నీలగిరి కమిషనర్‌

రేపే గణేష్‌ శోభాయాత్ర

ఫ వల్లభరావు చెరువు, సాగర్‌ ఎడమకాల్వకు తరలనున్న గణపయ్యలు

ఫ నిమజ్జన ప్రదేశాల్లో భారీ క్రేన్లు, లైటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement