ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 75.. మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి డివిజన్‌, మండల కేంద్రాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 9వ రాష్ట్రీయ పోషణ మహాపై రూపొందించిన పోసర్ట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ పాల్గొన్నారు.

సర్‌ దరఖాస్తులను వారంలో పరిష్కరిస్తాం

నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నిటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలను వివరించారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పనులన్నింటినీ అక్టోబర్‌ 2వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement