ఖమ్మంలో డిప్యుటేషన్‌ రద్దు, నల్లగొండకు కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో డిప్యుటేషన్‌ రద్దు, నల్లగొండకు కేటాయింపు

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

ఖమ్మం సహకారనగర్‌ : ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగలక్ష్మి డిప్యుటేషన్‌ను రద్దుచేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాపేట జిల్లాలో డీటీగా జె.నాగలక్ష్మి పోస్టింగ్‌ ఉండగా, ఇకపై నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి డిప్యుటేషన్‌ కేటాయించారు. ఈమేరకు ఆమెను ఖమ్మంలో వెంటనే రిలీవ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగా దాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్‌ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పోలీస్‌శాఖను ప్రజలకు చేరువ చేయాలనే పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మోడల్‌స్కూల్‌ ఉపాధ్యాయుడికి అవార్డు

శాలిగౌరారం : తెలుగు భాషాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా శాలిగౌరారం మండలంలోని వల్లాల ప్రభుత్వ మోడల్‌స్కూల్‌ తెలుగు ఉపాధ్యాయుడు కుక్కడపు శ్రీనివాసులు ఇన్నోవేషన్‌ టీచర్‌ అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జఠాధర ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, తెలంగాణ మోడల్‌స్కూల్స్‌ ఏఎంఓ మంజరీ చేతులమీదుగా శ్రీనివాసులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులును ఉపాధ్యాయులు అభినందించారు.

పచ్చదనం పెంపునకు సహకరించాలి

మిర్యాలగూడ అర్బన్‌ : రైల్వే ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే పోలీసులుగా ఎంతగానో కృషి చేస్తున్నామని రైల్వే ఏఎస్‌ఐ సుబ్బారావు అన్నారు. సోమవారం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వే స్టేషన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే కానిస్టేబుళ్లు ఎన్‌.కె.మీనా, ఆర్‌.జ్యోతి, ఇతర రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement