నల్లగొండ టౌన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్, కోట్ల సునీత, వీరమల్లు నాగరాజు గౌడ్, కర్నాటి మచ్చ గిరి, నాగరాజు పాల్గొన్నారు.


