డిండి : ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో చదువుతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుదవారం డిండిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, డార్మెటరీ, వాష్ రూమ్స్‌లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన రావడంతో అసంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాలోని చెత్తను ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా తరలించాలన్నారు. ఇటీవల పాఠశాల మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన రూ.26 లక్షలతో డ్రెనేజీ, తాగునీరు, లీకేజీ పైపులైన్ తదితర వంటి పెండింగ్ పనులను పూర్తి చేయాలని డీఈ శైలజకు సూచించారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మాత్రమే తెప్పించుకోవాలని, గడువు దాటిన సరుకులను వాదొద్దరని చెప్పారు. విద్యార్థినుల ఆత్మరక్షణకు కరాటే నేర్పించాలని ప్రిన్సిపాల్ శిరీషకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ వేజన, సర్పంచ్ రవి తదితరులున్నారు.
నోటీసులు జారీచేసి చర్యలు చేపట్టాలి
నల్లగొండ : ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బి.సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం 33,818 అన్‌మ్యాపింగ్ 2,34,972 అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ ప్రక్రియ చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ పాల్గొన్నారు.
ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
నల్లగొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపాల్స్ కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన ఛాంబర్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూనాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఆయన సమావేశమై మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 9 కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరూ మధ్యలో చదువు మానేయకుండా చూడాలని, కనీసం 75శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులంతా తప్పకుండా ఉత్తీర్ణులు కావాలన్నారు. సెప్టెంబర్ నెలలో మరోసారి ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్ష నిర్వహించాలని సూచించారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


