యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు.
- 8లో
కొడుకు ఎదుగుదల
చూడకుండానే..
ఫ దారుణ హత్యకు గురైన కల్లు రూపారెడ్డి
ఫ కొడుకు కోసమే సెలవు దినాల్లో హైదరాబాద్ పయనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : విద్యార్థి చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన నాగార్జున గ్రామర్ కాన్సెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి కొడుకును ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తమకు వివాహమైన పదేళ్లకు కొడుకు జన్మించడంతో అపురూపంగా చూసుకుంటున్న ఆమె అతని ఎదుగుదలను చూడాలనుకున్నారు. కానీ, తన కోరిక తీరకుండానే తమ స్కూల్లో చదువుకునే విద్యార్థి చేతిలోనే హత్యకు గురయ్యారు. ప్రస్తుతం బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె కొడుకు అభినవ్‌రెడ్డి కోసమే ఆమె ఆదివారాలు, సెలవు దినాల్లో హైదరాబాద్ వెళతారు. ఇప్పుడు, తల్లిని కోల్పోయిన ఆ కొడుకు కన్నీరుమున్నీరు అవుతుండడం అందరినీ కలచివేస్తోంది.
కుటుంబ నేపథ్యం ఇదీ..
కొండమల్లేపల్లి మండలంలోని పాతూరు ఆమె స్వగ్రామం. ఆమె చదువంతా కొండమల్లేపల్లి మండలంలోనే సాగింది. ఆమె బీఏ, బీఈడీ పూర్తి చేశారు. ఆమెకు 24 ఏళ్ల కిందట కల్లు రాజేందర్‌రెడ్డితో వివాహం జరిగింది. ఆమె భర్త రాజేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. రూపారెడ్డి 26 ఏళ్లుగా భాగస్వామ్యంలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. వారికి హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండడంతో కుమారుడు అక్కడే ఉండి చదువుకుంటున్నాడు. రూపారెడ్డి చివరిగా ఈనెల 7వ తేదీన పాఠశాలకు వెళ్లారు. ఆ తరువాత వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు వెళ్లి వచ్చారు. 11వ తేదీన స్కూల్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె అదే రోజు సాయంత్రం ఆమె దారుణ హత్యకు గురయ్యారు.
హత్యకు గురైన రూపారెడ్డి
(ఫైల్)


