కాంగ్రెస్‌.. ప్రజలను మోసం చేసింది | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌.. ప్రజలను మోసం చేసింది

Aug 21 2026 9:56 AM | Updated on Aug 21 2026 9:56 AM

నల్లగొండ టూటౌన్‌ : అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ సురిగి మణెమ్మ రమేష్‌తో పాటు 200 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి భూపాల్‌రెడ్డికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అదోగతి పాలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, నల్లగొండలో మంత్రిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌, దేప వెంకట్‌రెడ్డి, బోనగిరి దేవేందర్‌, నారబోయిన భిక్షం, తుమ్మల లింగస్వామి, దోటి శ్రీనివాస్‌, మేకల అరవింద్‌రెడ్డి, సల్వాది సైదులు, రేణుక, శంకర్‌, పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement