సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని రేషన్ కార్డుదారులకు శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల జారీరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్డుల జారీని ప్రారంభిచనుండగా, జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతులు మీదుగా కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవన్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించనుంది.
జిల్లాలో 5,41,043 కార్డులు
జిల్లాలో 1,051 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా మంజూరు చేసిన వాటితో కలుపుకొని 5,41,043 రేషన్‌కార్డులు ఉన్నాయి. వారందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్డులను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఏటీఎం కార్డు తరహాలో
ఇప్పటి వరకు కాగితంపై ఉన్న రేషన్ కార్డులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను రూపొందించింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ డిజిటల్ కార్డులను చినగకుండా, తడిసిపోకుండా భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుపై కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల పేర్లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు.
క్యూఆర్ కోడ్‌తో పూర్తి సమాచారం
స్మార్ట్ రేషన్ కార్డులో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను పొందుపరిచారు. రేషన్ దుకాణంలో కార్డును స్కాన్ చేయగానే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఫ 5.41 లక్షల మందికి కార్డుల పంపిణీ
ఫ ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన
ఫ క్యూఆర్ కోడ్‌తో పూర్తి వివరాలు
నియోజకవర్గాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డుల లెక్క
నియోజకవర్గం రేషన్ షాపులు స్మార్ట్ కార్డులు
నల్లగొండ 137 85,745
మునుగోడు 118 60,552
తుంగతుర్తి 31 16,409
నకిరేకల్ 143 83,589
మిర్యాలగూడ 179 1,01,526
నాగార్జునసాగర్ 203 93,126
దేవరకొండ 240 1,00,096


