పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి

Aug 15 2026 1:57 AM | Updated on Aug 15 2026 1:57 AM

నల్లగొండ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయ న ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ వేడుకలకు పోలీస్‌ శాఖ అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, డీఆర్‌ఓ దశరథ్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

18న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

నల్లగొండ : ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ పాత కళాశాలలో వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు, ట్రైనింగ్‌కు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ (జాబ్‌ ఫెయిర్‌), అప్రెంటిస్‌ షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్‌, నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో మేళాకు హాజరు కావాలని కోరారు.

సాగునీరిచ్చి రైతులను ఆదుకోవాలి

సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ : శ్రీశైలం ప్రాజెక్టుకు నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఈ వానాకాలం పంటలకు సాగునీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం గోపసముద్రం తండా, ఉట్లపల్లి గ్రామాల్లో వరినాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పంపుతున్నారని అన్నారు. డ్యాములన్నీ నిండిన తరువాతనే సాగర్‌కు నీటిని విడుదల చేస్తామనడం అన్యాయమన్నారు. నవంబర్‌లో నల్లగొండలో జరిగే జాతీయ రైతు సంఘం మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, మట్టారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.

యూనిఫాం అందించాలి

నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలోని డీఈఓ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన యూని ఫాం అందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్నాటి యాదగిరి, అనంత నాగరాజుగౌడ్‌, కొంపల్లి రామన్నగౌడ్‌, సతీష్‌, నాగరాజు, మహేష్‌, శివ, పృథ్వీరాజ్‌, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement