ఆర్టీసీలో ప్రచార హోరు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ప్రచార హోరు

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

పోటాపోటీగా హామీల వర్షం

నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌తో పాటు ఇతర సంఘాలు పోటీలు ఉన్నాయి. ఆయా సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల, కొత్త పే స్కేల్స్‌ అమలు, ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టుల భర్తీ, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, కార్మికుల కుటుంబ సభ్యులకు మెరుగైన హెల్త్‌ కార్డ్స్‌, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై సంఘాలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల నిర్వహిస్తుండడంతో నల్లగొండ రీజియన్‌ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 9న రహస్య బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరగనుండగా, బుధవారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని డిపోల్లో ప్రధాన సంఘాల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

రీజియన్‌లో పరిధిలో 2,036 మంది ఓటర్లు..

అక్టోబర్‌ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో నల్లగొండ రీజియన్‌ వ్యాప్తంగా మొత్తం 2,036 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో కండక్టర్లు 957 మంది, డ్రైవర్లు 673 మంది, గ్యారేజ్‌ సిబ్బంది 211 మంది, ఇతర సిబ్బంది 195 మంది ఉన్నారు.

గేట్‌ మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీ..

నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోల్లో ఎన్నికల సందడి పతాక స్థాయికి చేరింది. షిఫ్టులు మారే సమయంలో గ్యారేజీలు, బస్‌ స్టేషన్లలో గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మిక సంఘాల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం మద్దతు ఉన్న యూనియన్ల నాయకులు డిపోల వారీగా విస్తృత వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కార్మికుల ఇళ్లకు వెళ్లి ఆత్మీయ కలయికలు ఏర్పాటు చేసుకుంటూ చివరి నిమిషం వరకు ప్రతి ఓటునూ దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు.

ఫ నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచారం

ఫ 2,036 మంది ఓటర్లు,

9న పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement