ఓట్ల తొలగింపునకు నకిలీ కుట్ర! | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపునకు నకిలీ కుట్ర!

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

మిర్యాలగూడ : ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ కార్యక్రమంలో.. ఓటర్ల తొలగింపు ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. ఓటరు తొలగింపునకు అవసరమైన ఫారం–7ను కొందరు నకిలీవి సృష్టించి కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలో్‌ల్‌ ఓట్ల తొలగింపు పేరుతో బోగస్‌ ఫారం–7 పత్రాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మిర్యాలగూడ పట్టణంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముందస్తుగా ముద్రించిన ఫారం–7 పత్రాలను ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకులు ఓటర్ల ఇళ్లకు తిరుగుతూ పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు అప్రమత్తమయ్యారు.

కుటుంబ సభ్యులు పూరించి ఇవ్వాలి

నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణించినా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా తరలివెళ్లినా, లేదా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నా సంబంధిత కుటుంబసభ్యులు ఫారం–7 నింపి బీఎల్‌వోకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలను బీఎల్‌వో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆమోదముద్ర వేసి జాబితా నుంచి పేరు తొలగిస్తారు. అయితే ఒక జాతీయ పార్టీకి చెందిన శ్రేణులు తమ కార్యాలయం నుంచే ప్రింటెడ్‌ పత్రాలను సిద్ధం చేసి, ఒక నిర్ణీత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బంగారుగడ్డలో ఫారాలు ప్రత్యక్షం

మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ 29వ వార్డులో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఓటర్ల ఇంటికి బోగస్‌ పత్రాలు చేరడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. సదరు పత్రాల్లో ఓటరు పేరు, ఇంటి నంబర్‌, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య అత్యంత చిన్న అక్షరాలతో కంటికి కనిపించకుండా ముద్రించారు. మరణం, శాశ్వత స్థానాంతరం, భారతీయ పౌరుడు కాదు వంటి ఐదు కారణాల వద్ద బాక్సులు ఏర్పాటు చేసి అందులో బలవంతంగా టిక్‌ పెట్టించి ఓటర్ల వద్ద నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. వివరాలు సరిగా అర్థంకాక ముందే అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చి ఆ పత్రాలను బీఎల్‌వోలకు అందచేసి జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఫ కొందరు ఓటర్లకు ఫారం–7

బోగస్‌ పత్రాల పంపిణీ

ఫ మిర్యాలగూడలోని బంగారుగడ్డలో వెలుగుచూసిన ఫారాలు

ఫ ఆందోళనలో ఓటర్లు.. అప్రమత్తమైన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement