ప్రజా పాలనతోనే సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రజా పాలనతోనే సంక్షేమం

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

గరిడేపల్లి : ప్రజా పాలనతోనే ప్రజలకు సంక్షేమం అందుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయితే గడ్డిపల్లి ప్రాంతం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్య పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు అందించే విధంగా ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అడ్మిషన్లు కూడా జరగాలని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనుల ఫొటో గ్యాలరీని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి సందర్శించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement