డిండి.. పీటముడి | - | Sakshi
Sakshi News home page

డిండి.. పీటముడి

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

రెడ్‌క్రాస్‌ బరిలో 32 మంది

నల్లగొండ టౌన్‌ : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నల్లగొండ బ్రాంచి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెడ్‌క్రాస్‌ సొసైటీలో జిల్లా వ్యాప్తంగా 1351 మంది సభ్యులున్నారు. గతంలో రెడ్‌క్రాస్‌ సొసైటీకి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కోశాధికారి రాష్ట్ర మేనేజిమెంట్‌ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. 2026–29 సంవత్సరానికి గాను 15 మందితో కూడిన మేనేజింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నెల 3 నుంచి జిల్లా నామినేషన్లు స్వీకరించారు. రెడ్‌క్రాస్‌ నల్లగొండ బ్రాంచి చరిత్రలో తొలిసారిగా 33 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో పాటు తొలిసారిగా సేవాభారత్‌ సభ్యులు కూడా తమ నామినేషన్లు వేశారు. మంగళవారం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో 32 మంది బరిలో నిలిచారు.

11న పోలింగ్‌, ఫలితాలు

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 3 వరకు జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో నిర్వహిస్తారు. పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన 15 మంది సభ్యుల నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కోశాధికారితో పాటు రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుంది.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగొద్దు

నకిరేకల్‌ : విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా నకిరేకల్‌లోని పటేల్‌ నగర్‌లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద యార్డు క్లీనింగ్‌ పనులను మంగళవారం విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన చెట్లు, కంపచెట్లను సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఉన్న కంపచెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఏఈ ధర్మతేజతో పాటు విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

8న అండర్‌–19 కబడ్డీ జట్ల ఎంపిక

హాలియా : ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్‌– 19 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికను ఈనెల 8వ తేదీన హాలియాలోని శ్రీ శ్లోక పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట పదవ తరగతి ఒరిజినల్‌ మెమో, రెండు పాస్‌ ఫోటోలు తీసుకురావాలని సూచించారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో పీటముడి వీడలేదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు కథ మరోసారి మొదటికొచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు ఈ సమస్యను మరింత జఠిలం చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్ష చేసినా ఓ కొలిక్కరాకపోవడం.. ఏదుల నుంచి మొత్తం నీటిని మహబూబ్‌నగర్‌కే తీసుకుంటామని, డిండికి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచే తీసుకోవాలంటూ చేసిన ప్రతిపాదనతో ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2015లో జూన్‌ 11న రూ.6,194 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు (జీవో 107) జారీచేసింది. నల్లగొండ జిల్లాలో 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులకు చేపట్టింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించడంతో పాటు డిండికి నీటిని ఏదులలో ప్రతిపాదించిన వీరాంజనేయ రిజర్వాయర్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీశైలం ప్రాజెక్టులోని వెనుక జలాల నుంచి అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా నీటిని తీసుకొని కొంతదూరం వచ్చాక పంప్‌హౌస్‌ నిర్మించి అక్కడి నుంచి నార్లాపూర్‌వద్ద నిర్మించే అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా.., దాని నుంచి ఏదులకు నీటిని తరలించేలా చర్యలు చేపట్టింది. ఏదుల నుంచే 436.41 అడుగుల నీటిమట్టం నుంచి ఇటు డిండికి, అటు మహబూబ్‌నగర్‌కు నీటిని తరలించాలని నిర్ణయించింది.

ఏదుల నీటిమట్టం విషయంలో పేచీ.

ఏదుల రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 445 అడుగులు. రిజర్వాయర్‌లో 436.41 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లాకు, నల్లగొండ జిల్లాకు నీటిని తీసుకునేలా మొదట నిర్ణయించారు. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా నేతల ఒత్తిడితో గత ఏడాది ఇంజనీర్ల కమిటీ మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మహబూబ్‌నగర్‌కు 436.41 అడుగుల వద్ద నీటిని తీసుకునే అవకాశం కల్పిస్తూ, డిండికి మాత్రం 440 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై నల్లగొండ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 436 అడుగుల వద్ద మహబూబ్‌నగర్‌కు నీటిని తీసుకుంటే ఏదుల రిజర్వాయర్‌ నీటిమట్టం 440 అడుగులకు చేరే అవకాశం తక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమైంది. కాలువల ద్వారా 6 వేల క్యూసెక్కులు రావాల్సిన నీరు 1500కు పడిపోయే ప్రమాదం ఉంది. మహబూబ్‌నగర్‌ 436 అడుగుల వద్దే నీటిని తీసుకుంటే.. 440 అడుగులకు నీటిమట్టం పెరగకపోవడంతో డిండి ద్వారా నల్లగొండకు నీరు అందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని అఖిలపక్షాల నేతలు, జిల్లా మంత్రులు ప్రభుత్వాన్ని కోరారు. అప్పట్లో ఈ సమస్యకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

వైటీపీఎస్‌లో రూ.114కోట్లతో టెండర్లు

మిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో ఐదు యూనిట్లు(ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల) సామర్థ్యం గల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టు ప్రాంగణంలో రైల్వే సైడింగ్‌, రైల్వే ట్రాక్‌ నిర్వహణ పనుల కోసం తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీజీజెన్‌కో) రూ.114కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్ట్‌ నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు విద్యుత్‌ సౌధలోని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(జనరేషన్‌–3) కార్యాలయం నుంచి అధికారిక టెండర్‌ నోటీసు విడుదల చేశారు. ప్రాజెక్టులోని రైల్వే సైడింగ్‌ ఆపరేషన్‌, ట్రాక్‌ మెయింటెనెన్స్‌, లోకోమోటివ్స్‌, సిగ్నలింగ్‌, ట్రాన్స్‌మిషన్‌, సంబందిత పనిముట్లు, వినియోగ వస్తువుల సమగ్ర నిర్వహణ కోసం మూడేళ్ల కాల పరిమితికి గాను కాంట్రాక్టర్ల నుంచి ఓపెన్‌ టెండర్ల విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. టీజీ జెన్‌కో యాజమాన్య ప్రాధాన్యతను బట్టి ఈ కాంట్రాక్ట్‌ కాలాన్ని మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు.

నల్లగొండలో ర్యాలీ నిర్వహిస్తున్న ఇండియా కూటమి నేతలు, పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌

నల్లగొండ : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ నినాదంతో ఇండియా కూట మి ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగింది. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలపై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు జిల్లాపల్లి పరమేశ్‌, బోడ స్వామి, గోపగోని మాధవి, సుకన్య, నాగేశ్వర్‌రావు, పులి పాపయ్య, జగన్నాథం, శ్రీనివాస్‌రెడ్డి, గజ్జి రవి, బొమ్మిడి నాగేష్‌, బొంగరాల నరసింహ, బీఎన్‌ చారి, వెంకన్న, అక్కెనపల్లి అంజి, అశోక్‌ పాల్గొన్నారు.

ఫ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో వీడని సందిగ్ధం

ఫ సీఎం, మంత్రి చర్చించినా కొలిక్కిరాని అంశం

ఫ ఏదుల వద్ద 436 అడుగుల నుంచి నీటిని తీసుకునేందుకు కుదరని ఏకాభిప్రాయం

ఫ 440 వద్ద నుంచి తీసుకుంటే నల్లగొండకు ప్రయోజనం అంతంతే

ఫ నేరుగా శ్రీశైలం నుంచే తీసుకోవాలనే ప్రతిపాదనపై గందరగోళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement