నల్లగొండ : బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మహనీయులు ఆశయ సాధన సమితి (మాస్), జగ్జీవన్ రామ్–అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ, అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శశికళ, అంబేద్కర్–జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, మాస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరణ్ జయరాజ్, గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖకుమార్, జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్‌కుమార్, ఉమామహేశ్వర్, కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు.


