రామగిరి(నల్లగొండ) : సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ఎన్.ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారంథాయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం పీహెచ్‌సీకి వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న మందుల తదితర వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.యాకుబ్‌నాయక్, సర్పంచ్ చామకూరి శంకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


