రాజీవ్‌ యువ వికాసం.. దరఖాస్తులకే పరిమితం! | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ యువ వికాసం.. దరఖాస్తులకే పరిమితం!

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

దరఖాస్తులన్నీ హోల్డ్‌లోనే ఉన్నాయి..

రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 79,495 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి తదుపరి ప్రక్రియను కొనసాగించడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే వెంటనే దరఖాస్తుల పరిశీలనతో పాటు తదుపరి కార్యాచరణ చేపడతాం. ఇప్పటివరకై తే దరఖాస్తులన్నీ హోల్డ్‌లోనే ఉన్నాయి.

– శశికళ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి నల్లగొండ

కొండమల్లేపల్లి : యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2025లో రాజీవ్‌ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీతో రుణాలను మంజూరు చేయడానికి యువత నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎన్నో ఆశలతో యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. కానీ, లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఈ పథకం అమలుకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై దృష్టి సారించాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సబ్సిడీ వివరాలు..

రాజీవ్‌ యువ వికాస పథకానికి సంబంధించి రూ.50 వేల రుణానికి 100 శాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల వరకు 80 శా తం సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70శాతం సబ్సిడీ ఉందని అధికారులు తెలి పారు. 2025లో దరఖాస్తులు స్వీకరించగా ఆయా కేటగిరీల నుంచి 79,495 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తప్పని ఎదురు చూపులు..

దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మొదటగా రూ.లక్షకు సంబంధించిన యూనిట్లను గతేడాది జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. చివరి క్షణంలో పలు ఆరోపణలు రావడంతో రుణాల పంపిణీ వాయిదా వేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క యూనిట్‌ కూడా మంజూరు చేయలేదు. రుణాలు మంజూరు చేస్తే వాటితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగించాలని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం రుణాల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఫ పథకానికి మొత్తం 79,495 దరఖాస్తులు

ఫ లబ్ధిదారుల ఎంపిక.. యూనిట్ల మంజూరుపై స్పష్టత కరువు

ఫ యువత తప్పని ఎదురుచూపులు

కేటగిరీల వారీగా

దరఖాస్తులు ఇలా..

కేటగిరి దరఖాస్తులు

ఎస్సీ 21,203

బీసీ 39,370

ఈబీసీ 2000

ఎస్టీ 11,581

ముస్లిం 5,112

క్రిస్టియన్‌ 229

మొత్తం 79,495

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement