రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నేడు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నేడు శంకుస్థాపన

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి – మునుగోడు రూట్‌లో నార్కట్‌పల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన పనులను శనివారం ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించి మాట్లాడారు. రూ.76 కోట్లతో కిలో మీటర్‌ వరకు రైల్వే ఫ్లైఓవర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్‌ పూర్తయితే నార్కట్‌పల్లి మునుగోడు మధ్య వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఉండదన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ సుధాకర్‌, ఏఈ అజయ్‌, సర్పంచ్‌ భరత్‌, సైదులు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాయం శ్యాంసుందర్‌రెడ్డి, బత్తుల ఉషయ్య, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, యానాల రాంరెడ్డి, ప్రజ్ఞాపూర్‌ సత్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement