నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫోన్‌ద్వారా పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వికసిత్ భారత్‌లో భాగస్వాములు కావాలి
నల్లగొండ టూటౌన్ : మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ భారత్‌లో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పులు అంజిరెడ్డి అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో సోమవారం మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ భారత్ విద్యార్థుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే విద్యార్థులందరి భాగస్వామ్యం అవసరం అన్నారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, జిల్లా యూత్ ఆఫీసర్ గౌతమ్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కట్టా కిరణ్మయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహాశివుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


