తిప్పర్తి మండలానికి చెందిన రమేష్ వెన్నెముక దెబ్బతిన్నా మనోధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.
- 8లో
పలువురు ఎస్‌ఐల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో జిల్లాలో 9 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు 5వ జోన్ డీఐజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, ప్రజాహితం దృష్ట్యా ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ 1టౌన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న బి.లచ్చిరెడ్డి మోతె ఎస్‌ఐగా, మోతె ఎస్‌ఐ టి.అజయ్‌కుమార్ సూర్యాపేట–1 టౌన్‌లో ఎస్‌ఐ–2గా, సూర్యాపేట–1 టౌన్ ఎస్‌ఐ బి.మోహన్‌బాబు చిలుకూరు ఎస్‌ఐగా, తేజస్విని డీఎస్‌బీ సూర్యాపేట నుంచి నడిగూడెం ఎస్‌ఐగా, జి.అజయ్‌కుమార్ నడిగూడెం నుంచి కోదాడ టౌన్ ఎస్‌ఐ1గా, కె.ఉపేందర్‌రెడ్డి వీఆర్ సూర్యాపేట నుంచి కోదాడ టౌన్ ఎస్‌ఐ–2గా, సీహెచ్. గోపాల్‌రెడ్డి కోదాడ రూరల్ నుంచి నేరేడుచర్ల ఎస్‌ఐగా, ఎస్‌కే.యాకుబ్ డీసీఆర్‌బీ సూర్యాపేట నుంచి కోదాడ రూరల్ ఎస్‌ఐగా, చిలుకూరు ఎస్‌ఐ వి.సురేష్‌రెడ్డి నల్లగొండ వీఆర్‌కు బదిలీ అయ్యారు.


