నూతన కలెక్టర్‌గా చంద్రశేఖర్
సబ్ కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు రద్దు
నల్లగొండ: జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్ రానున్నారు. ఈయన సంగారెడ్డిలో లోకల్‌బాడీ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై నల్లగొండ కలెక్టర్‌గా వస్తున్నారు. నల్లగొండ కలెక్టర్‌గా ప్రస్తుతం పని చేస్తున్న ఇలా త్రిపాఠి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఇలా త్రిపాఠి 2024 అక్టోబరు 28న నల్లగొండ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 14 నెలల పాటు ఆమె జిల్లాలో పని చేశారు. ఈ కాలంలో ఆమె విద్యా, వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లను నిరంతం తనిఖీలు చేసి.. వాటి బాగుకోసం కృషి చేశారు. పలుమార్లు విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ప్రోత్సహించారు. కేజీబీవీలో పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థినులను విమానం ఎక్కించి ఆ ఖర్చులు భరించారు. జిల్లాలోని ఆస్పత్రులను నిరంతరం తనిఖీలు చేశారు. సౌకర్యాల కల్పనకు, వైద్య సేవలు మెరుగు పడేందుకు కృషి చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాల నిర్మాణానికి పాటుపడ్డారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అయిటిపాములలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించారు. ఈసీఐఎల్ కంపెనీ సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు అందించారు. మహిళ అయినప్పటికీ కలెక్టరేట్‌కు పరిమితం కాకుండా జిల్లా అంతా పర్యటిస్తూ జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను నారాయణ్‌పేట జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించినట్లు ఈనెల 25న వెలువడిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ ఆగిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నారాయణపేటకు బదిలీ చేసింది. నారాయణ్ అమిత్ బదిలీ ప్రక్రియ రద్దు చేయడంతో మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా ఆయన యథావిధిగా కొనసాగనున్నారు.
ఫ ఇలా త్రిపాఠి నిజామాబాద్
కలెక్టర్‌గా బదిలీ


