డీపీఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వెంకయ్య మంగళవారం బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో నల్లగొండ డీపీఓగా బదిలీపై వచ్చిన ఆయనను ములుగు జిల్లా డీపీఓగా బదిలీ చేశారు.
యువజన కాంగ్రెస్‌ను
పటిష్టం చేయాలి
నల్లగొండ : యువజన కాంగ్రెస్‌ను పటిష్టం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం జిల్లా యువజన కాంగ్రెస్ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. సర్పంచ్‌గా గెలిచిన యువజన నాయకులు అభివృద్ధికి పాటు పడాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి కెఆర్.భవ్య, నాయకులు పొన్నం తరుణ్‌గౌడ్, దుబ్బాక చంద్రిక, పాలడుగు నాగార్జున, మౌనిక, గౌతమి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
నట్టల నివారణ మందు పంపిణీ పరిశీలన
చిట్యాల : జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ జీవీ.రమేష్ మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో మంగళవారం పరిశీలించారు. నిర్ణిత సమయంలో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, పశువైద్యుడు అమరేందర్, జేవీఓ సైదులు, బొడ్డు శ్రీను, సాగర్ల మహేష్, జీవాల పెంపకందారులు పాల్గొన్నారు.
రైతులు ఎఫ్‌పీఓ ఏర్పాటు చేసుకోవాలి
చిట్యాల : గ్రామాల్లోని రైతులంతా కలిసి పంటలను ఉత్పత్తి చేసి, నిల్వచేసి అమ్ముకుని ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వీలుగా ఎఫ్‌పీఓ (ఫార్మార్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి సుభాషిణి సూచించారు. రైతు కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం తాళ్లవెల్లెంల గ్రామంలోని రైతులతో సమావేశమై మాట్లాడారు. కూరగాయల సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలను, బింధు సేద్యం విధానం, కూరగాయాల మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పంటల సాగుకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఆమె రైతులకు వివరించారు. ఆనంతరం గ్రామంలోని పజ్జూరి అజయ్‌కుమార్‌రెడ్డి అరటితోటను సందర్శించారు. కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి శ్వేత, సర్పంచ్ జోగు సురేష్, రైతులు గోపగోని వెంకన్న, స్వామి పాల్గొన్నారు.
డీపీఓ బదిలీ
డీపీఓ బదిలీ


