వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మాడుగులపల్లి : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని ధర్మాపురంలో మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ, దీప్తి ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఎస్పీ శరత్‌చంద్రపవార్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేతతో కలిసి ఎంపీ రఘువీర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బారిన పడకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. గ్రామంలోని 300 మందికి ఉచితంగా వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్త దశరథ, వైద్యులు కొండేటి సౌమ్యశ్రీ, డాక్టర్ ప్రమోద్‌కుమార్, నితీష, ఇమానియేల్, రోహిత్, నాయకులు అంకతి సత్యం, చింతరెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


