సత్య సాయి ప్రేమ వాహిని రథయాత్ర
రామగిరి(నల్లగొండ): పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి నల్లగొండ పట్టణంలో సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్రను ఘనంగా వైభవంగా నిర్వహించారు. పుట్టపర్తి నుంచి అలంకరించిన వాహనంలో సాయిబాబా చిత్రపటాన్ని వివిధ జిల్లాలు పర్యటిస్తూ మంగళవారం ఉదయం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో రథయాత్రకు ఘన స్వాగతం పలికి సాయిబాబా ఆలయానికి తీసుకువచ్చారు. రాత్రి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కోలాటాలు భజనలు కీర్తనలతో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ విశ్వేశ్వర్, తుకారం, మురళీధర్, మదన్మోహన్, మల్లికార్జున్‌రెడ్డి, కవిత, దేవి, లకుమారపు శ్రీనివాస్, గోవింద బాలరాజ్, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


