‘ప్రత్యేక’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాలపై గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో ఎలాంటి పనులు చేపట్టాలి, వారికి ఏమి అవసరం ఉన్నాయో వెంటనే గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు నారాయణ అమిత్, రాజ్‌కుమార్, నల్లగొండ, చండూరు ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


