తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
నాగార్జునసాగర్: దర్తి ఆభాజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పాటు అంచనాలు రూ పొందించాలని కలెక్టర్ ఇలాత్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దర్తి ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి గతేడాది నవంబర్ 14న ప్రారంభించారని, ఈ పథకం అమలులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలు, తండాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో ఎంపిక చేసిన గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.95కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని, అంచనాల దస్త్రాలు అందగానే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రత్యేకించి నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో తిరుమలగిరి(సాగర్)పెద్దవూర, త్రిపురారం మండలాల్లో గుర్తించిన 18 తండాల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్, గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, మత్స్యశాఖ ఏడీ చరిత, నందికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


