ఉపాధిహామీ పేరు మార్పు వద్దు
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ విబి జి రామ్ జి –2025 తీసుకురావడానికి నిరసిస్తూ సీసీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్‌లో మంగళవారం రాస్తారోకో చేసారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే పథకం పేరును మార్చుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వామక్షాల నాయకులు హశం, సాగర్, వీరస్వామి, నరసింహ, వి.లెనిన్, ఎం.ముత్యాలు, అక్కలయ్య, వీరయ్య, షరీఫ్, బండ శ్రీశైలం, పి.ప్రభావతి, సలీం, దండంపెల్లి సత్తయ్య, అవుట రవీందర్, తుమ్మల పద్మ, కృష్ణారెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.


