ముగిసిన ఎన్నికల కోడ్
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల కోడ్ ఈ నెల 19తో ముగిసింది. ఈ నెల 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉప సర్పంచ్ ఎన్నికల నేపధ్యంలో 19వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ ముగిసిపోయింది.
దర్వేశిపురం హుండీ ఆదాయం రూ.13,71,173
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపును మంగళవారం నిర్వహించారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం సమకూరిందని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సర్పంచ్ రాయల శేఖర్, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, రాజయ్య, ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
నల్లగొండ టౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యులంతా సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో వైద్యాదికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనితీరు బాగాలేని పీహెచ్‌సీల అధికారులను మందలించడంతో పాటు పరితీరు మెరుగ్గా ఉన్న అధికారులను ప్రసంశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు దీప, కళ్యాణ్‌చక్రవర్తి, కృష్ణమూర్తి, పద్మ, తిరుపతిరావు, విష్ణు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేటీఆర్‌వి మతిస్థిమితంలేని మాటలు
నల్లగొండ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌వి మతిస్థిమితం లేని మాటలని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్‌ఎల్‌బీసీలో తట్టెడు మట్టి తీయలేదని.. ఇప్పుడు కృష్ణా జలాలు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ నల్లగొండలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తు తగ్గించి తెలంగణకు ద్రోహం చేసింది కేసీఆరే అన్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను ఎడారి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సమావేశంలో నాయకులు కన్నారావు, బోడ స్వామి, జిల్లా పరమేష్, చింతమల్ల వెంకటయ్య, పుట్ట వెంకన్నగౌడ్, తిరుమలేష్, శివగౌడ్, నరేష్, కర్నాటి మత్స్యగిరి, వేణు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
25న వార్షికోత్సవ మహాసభలు
నల్లగొండ టౌన్ : సుశృత గ్రామీణ వైద్యుల(ఫస్ట్ ఎయిడ్) సంఘం జిల్లా 19వ వార్షికోత్సవ మహాసభలను ఈ నెల 25న పానగల్ బైపాస్‌లోని సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివారాజు తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మహాసభలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నామన్నారు. ఈ మహాసభకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఎంహెచ్‌ఓ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నర్సింహారెడ్డి, డీఎస్‌ఎన్ చారి, నసీరుద్దీన్, వెంకటేశ్వర్లుగౌడ్, కృష్ణారెడ్డి, మధనాచారి, రాజశేఖర్‌రావు, యాదగిరి, దశరథ, ప్రశాంత్, శ్రీనివాస్, ఖదీర్, నాగరాజు పాల్గొన్నారు.
ముగిసిన ఎన్నికల కోడ్


