నోటాకు 3,132 ఓట్లు | - | Sakshi
Sakshi News home page

నోటాకు 3,132 ఓట్లు

Dec 24 2025 4:17 AM | Updated on Dec 24 2025 4:17 AM

నోటాకు 3,132 ఓట్లు

నోటాకు 3,132 ఓట్లు

చెల్లని ఓట్లు 12 వేల పైనే..

పంచాయతీ ఎన్నికల్లోతొలిసారి నోటా

సర్పంచ్‌ అభ్యర్థుల్లో నోటాకు భారీగా పోలైన ఓట్లు

ఓటర్లకు అవగాహన లేక

చెల్లకుండాపోయిన 12,253 ఓట్లు

మండలాల వారీగా వివరాలు..

మండలం నోటాకు చెల్లనిఓట్లు

నల్లగొండ 122 417

తిప్పర్తి 65 279

కనగల్‌ 60 387

దేవరకొండ 125 431

కొండమల్లేపల్లి 57 328

డిండి 107 570

గుడిపల్లి 54 175

పీఏపల్లి 54 325

చందంపేట 55 347

నేరేడుగొమ్ము 38 297

చింతపల్లి 40 504

మునుగోడు 105 449

చండూరు 59 312

మర్రిగూడ 104 346

నాంపల్లి 236 427

గట్టుప్పల్‌ 50 266

నకిరేకల్‌ 94 347

కట్టంగూర్‌ 68 369

నార్కట్‌పల్లి 122 450

శాలిగౌరారం 84 544

చిట్యాల 90 359

కేతేపల్లి 62 512

మిర్యాలగూడ 156 691

§éÐ]l$-Æý‡-^èl-Æý‡Ï‍ -153 -376

మాడుగులపల్లి 113 181

అడవిదేవులపల్లి 34 188

వేములపల్లి 51 274

అనుముల 69 285

పెద్దవూర 267 348

త్రిపురారం 118 521

తిరుమలగిరి(సాగర్‌) 82 387

నిడమనూరు 145 128

గుర్రంపోడు 93 433

మొత్తం 3,132 12,253

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ 3,132 మంది ఓట్లు నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానంపైనా అవగాహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 12,253 ఓట్లు చెల్లకుండా పోయాయి. అయితే.. అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 34 మంది, పెద్దవూర మండలంలో అత్యధికంగా 267 మంది నోటాకు వోటేశారు.

మొదటిసారి నోటా

ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి.. అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్‌, వార్డు మెంబర్ల బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3,132 మంది ఓటర్లు సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్‌పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మూడు వితల్లో ఎన్నికలు

జిల్లాలో 33 మండలాల పరిధిలో మూడు విడతల్లో (ఈనెల 11, 14, 17 తేదీల్లో )ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో మాడుగులపల్లి మండలం ఇందుగులలో న్యాయవివాదంతో, అదే మండలంలోని అభంగాపురం, అనుముల మండలం పేరూరులో అభ్యర్థుల్లేక సర్పంచ్‌ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా 866 గ్రామ పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీల పరిధిలో 10,37,411 మంది ఓటర్లుండగా 9,00,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జిల్లాలో 3,132 మంది అభ్యర్థులు నోటాకు ఓటు వేసి తమకు అభ్యర్థులు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

జిల్లాలో వేల మందికి ఓట్లు వేయడం కూడా రాలేదు. ఇన్నాళ్లూ ఈవీఎంలకు అలవాటు పడిన ప్రజలు సర్పంచ్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సులో స్వస్తిక్‌ ముద్ర వేయాల్సి ఉండగా.. అది కూడా సరిగ్గా వేయకపోవడంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. అలా జిల్లా వ్యాప్తంగా 12,253 ఓట్లు చెల్లలేదు. ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ఓట్లు చెల్లకుండా పోయాయని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement