దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు
నల్లగొండ : దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించిన కలెక్టర్.. సొంతంగా కదలలేని దివ్యాంగుల కోసం బ్యాటరీ సహాయంతో నడిచే మూడు చక్రాల సైకిళ్లను ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి జిల్లాలోని సుమారు 105 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్‌ను ఇప్పించనున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని మహిళా ప్రాంగణంలో బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమానికి ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణు బాబు, ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ హాజరుకానున్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ సుమారు రూ.70 వేల ఉంటుంది.. మొత్తం 105 బ్యాటరీ ట్రై సైకిల్స్‌ను ఈసీఐఎల్ అందించనుంది. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ వల్ల దివ్యాంగులలో ఆత్మస్థైర్యం పెరగడమే కాకుండా, వారు జీవనోపాధులను పెంపొందించుకునేందుకు మంచి అవకాశం కలుగుతుంది.
ఫ 105 వాహనాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఈసీఐఎల్
ఫ ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ ఇలా త్రిపాఠి


