కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుంది
ఎంజీయూ వద్ద ఆగిన కేటీఆర్
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి భయం పటుకుని.. ఎన్నికలపై వెనుకడుగు వేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.తారకరామారావు అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల సన్మానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీలపై ప్రజలు నిలదీస్తారని సీఎం భయపడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలపై అన్యాయం విషయంలో మాట్లాడకుండా నల్లగొండ జిల్లా రైతులకు తీరని నష్టం చేస్తున్నాడని మండిపడ్డారు. అబద్దాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులకు కేసీఆర్ అంటే భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు రూ.15 వేలు, పెన్షన్లు రూ.4 వేలు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేసామన్న నమ్మకం ఉంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహాకార సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యమై ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు ఏ పార్టీలో ఉన్నామో అని చెప్పుకునే ధైర్యం, దమ్ములేదన్నారు. కరెంట్, కాళేశ్వరం అవినీతి అని మొత్తుకున్న కాంగ్రెస్ వాళ్లకు కోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రాలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా మా కార్యకర్తలు భయపడలేదన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, నల్లమోతు సిద్దార్ధ, చకిలం అనిల్‌కుమార్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఇస్లావత్ రామచందర్‌నాయక్, రాకేష్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, కొండూరు సత్యనారాయణ, జమాల్‌ఖాద్రి, అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గమధ్యలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద కాసేపు ఆగారు. బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు కేటీఆర్‌కు బోకే అందజేసి స్వాగతం పలికారు. యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయనకు వివరించారు. కార్యక్రమంలో వాడపల్లి నవీన్, శివకుమార్, పొలగోని శివ, అశోక్, కోటేష్, లావణ్య, మహేశ్వరి, మానస పాల్గొన్నారు.
ఫ ఎన్నికలపై వెనుకడుగు వేస్తోంది
ఫ సర్పంచ్‌ల అభినందన సభలో
మాజీ మంత్రి కేటీఆర్


