నల్లగొండ జిల్లాలో అత్యధికంగా దేవరకొండలో 310 పోలింగ్ స్టేషన్లు ఉండగా అక్కడ 23 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. అతి తక్కువగా 307 పోలింగ్ స్టేషన్లు ఉన్న మిర్యాలగూడలో 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. నల్లగొండ నియోజకవర్గంలో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవనుండగా నకిరేకల్, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అందరి ఓట్లను లెక్కించాలి కాబట్టి దీంతో కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ మునుగోడు ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.