నిబంధనల మేరకు వాహన రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు వాహన రిజిస్ట్రేషన్లు

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

కందనూలు: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల మేరకు వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ సమీపంలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరై, సమయపాలన పాటించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను అనవసరంగా వేచి ఉండేలా చేయకుండా, వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో జాప్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ క్రమంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం కార్యాలయానికి వచ్చిన ఓ దరఖాస్తుదారుడితో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ, దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, రుసుంల చెల్లింపు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన దరఖాస్తు రుసుం మాత్రమే వసూలు చేస్తున్నారా.. అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సి వస్తుందా.. దరఖాస్తు చేసుకుని ఎన్ని రోజులు అయింది.. దరఖాస్తు ప్రక్రియలో అధికారులు లేదా సిబ్బంది నుంచి ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా.. అని వాకబు చేశారు. ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement