మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి పరామర్శ

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిని పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పరామర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సింగోటంలోని వ్యవసాయ క్షేత్రంలో హర్షవర్ధన్‌రెడ్డిని కలిసి.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన తండ్రి లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అలాగే కల్వకుర్తి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ విజితారెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్‌నాయక్‌ హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement