జల జగడం! | - | Sakshi
Sakshi News home page

జల జగడం!

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

పటిష్ట బందోబస్తు..

జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రైతులు ఆందోళనకు వస్తే వారిని నివారించేందుకు వీలుగా బలగాలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రైతుల ధర్నాలతో జూరాల ప్రాజెక్టు ధర్నా చౌక్‌గా మారింది.

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కాల్వలకు సాగునీటి సరఫరా నిలిపివేయడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రాజెక్టు అధికారుల మధ్య జల జగడం మొదలైంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ ప్రాజెక్టుపై నాలుగు రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రాజెక్టు అధికారులు మాత్రం సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు ప్రాజెక్టుపై ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రైతులు ఏకంగా అధికారుల ఎదుటే ప్రధాన ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటరీ షట్టర్ల తాళాలు పగులగొట్టి కాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో సమస్య తీవ్రమైంది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం ప్రధాన ఎడమకాల్వ హెడ్‌ రెగ్యులేటరీ వద్ద పోలీసు బెటాలియన్‌తో పహార ఏర్పాటు చేసి, కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తారని ఆశించిన రైతుల ఆశలను ప్రాజెక్టు అధికారులు పూర్తిగా తుడిచేయడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందదని రైతులు ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు.

రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు..

రైతుల ఆందోళనకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు పలుకుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. వానాకాలం ఆరంభంలోనే ఆయకట్టుకు క్రాప్‌ హాలిడే ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలంటూ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించిన ప్రాజెక్టు అధికారులు.. ఇప్పుడు ఆయకట్టుకు ఎందుకు సాగునీరు వదలడం లేదని నిలదీస్తున్నారు.

జూరాల కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత కరువు

ఆందోళనలు, రాస్తారోకోలతో వేడెక్కిన వివాదం

తాగునీటికే ప్రాధాన్యమంటున్న ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement