దేవరకద్ర/ చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయం వద్ద చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి వద్ద నియోజకవర్గంలో రూ.153 కోట్లతో చేపడుతున్న పలు రహదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణం పనుల రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2027 జూలై నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


