గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

కొల్లాపూర్‌: ఎన్నికలకు ముందు చేవెళ్ల సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌ అమలుచేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మానాయక్‌ డిమాండ్‌ చేశారు. కొల్లాపూర్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం రెండో జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గిరిజన రైతులకు వెంటనే కరువు ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన ఐటీడీఏలను ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అటవీ ప్రాంతాలను అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్రిస్తున్నాయని.. దీన్ని గిరిజనులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కె.రవినాయక్‌, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.అశోక్‌నాయక్‌, ఉపాధ్యక్షులుగా శ్రీనునాయక్‌, లక్పతి నాయక్‌, సహాయ కార్యదర్శులుగా శివ ప్రచండ, తిరుపతి నాయక్‌, రాజగోపాల్‌, ఎల్‌.వెంకటేశ్‌, వి.గోపాల్‌, పత్యానాయక్‌, మల్లేష్‌, దశరథం, కె.శంకర్‌నాయక్‌, గౌరవాధ్యక్షుడిగా ఎల్‌.దేశ్యానాయక్‌, గౌరవ సలహాదారుగా ఆర్‌.పాండునాయక్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement