న్యూస్‌రీల్
విలీన దినోత్సవం..
తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
–8లో u
గణేష్ మండపాల వద్ద డీజేలు పెట్టొద్దు : ఎస్పీ
కందనూలు: గణేష్ మండపాలు, శోభాయాత్రలో డీజేలు పెట్టొద్దని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముందస్తుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి, మండపం వివరాలు, వేడుకలు నిర్వహించే తేదీలు, నిమజ్జన వాహనాలు, నిమజ్జన మార్గానికి సంబంధించిన వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని మండపాలు, శోభాయాత్రలో డీజేలను ఉపయోగించరాదని చెప్పారు. రాత్రివేళల్లో మండపం వద్ద కనీసం ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్లు సంబంధిత అధికారుల సమన్వయంతో తీసుకోవాలని, మద్యం తాగిన వ్యక్తులను శోభాయాత్రలో పాల్గొనకుండా చూడాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభాయాత్ర సమయంలో అసాంఘిక శక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. ప్రశాంతమైన, సురక్షితమైన వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
పక్కాగా సర్ ప్రక్రియ
ఉప్పునుంతల: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (సర్)లో మిస్ మ్యాచ్, మిస్ మ్యాపింగ్ అయిన ఓటర్లకు తప్పనిసరిగా నోటీసులు అందజేసి వారి నుంచి విధిగా సరైన ఆధారాలు సేకరించాలని సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా సూచించారు. శనివారం ఉప్పునుంతలలో నిర్వహించిన సర్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఓటర్లకు నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియ వివరాలను డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ఓటర్లు సమర్పిస్తున్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
అడవుల్లోకి గొర్రెల కాపరులు వెళ్లొద్దు
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ రేంజ్ అంటవీ ప్రాంతంలోని ముక్కిడిగుండం, నార్లాపూర్, మొలచింతలపల్లి గ్రామాల పరిసర ప్రాంత గొర్రెల కాపరులు అడవుల్లోకి వెళ్లరాదని, ఈ ప్రాంతంలో గొర్రెలు మేపడం, అడవిలో నిద్రించడం పూర్తిగా నిషేధించడం జరిగిందని రేంజర్ వాణికుమారి అన్నారు. శనివారం ఆమె అటవీ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ జూలై నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతానోత్పత్తి కావడంతో ఈ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు సహజ ఆవాసాలు, సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాలు, అటవీశాఖ ఆదేశాల మేరకు సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు. గొర్రెల కాపరులు అనుమతి లేకుండా అటవీలోకి ప్రవేశించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 4 పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కరీంనగర్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. 8–10 ఏళ్ల విభాగంలో రిత్విక్‌రెడ్డి, 10–12 ఏళ్ల విభాగంలో దౌసిక్ శ్రీప్రసాద్, 14–16 ఏళ్ల విభాగంలో ఎం.శివతేజ, 16–18 ఏళ్ల విభాగంలో సీహెచ్.అఖిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. అదే విధంగా 12–14 ఏళ్ల బాలుర విభాగంలో జయచంద్ర నాలుగోస్థానం, బాలికల విభాగంలో ఎం.రూప ఐదోస్థానం, 16–8 ఏళ్ల బాలుర విభాగంలో ఎన్.మధు ఆరో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, టి.చంద్రశేఖర్, చైర్మన్ శాంతికుమార్, కార్యనిర్వాహక కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు అభినందించారు.
ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు.
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు.
నల్లమల
ప్రాంతంలో
మేలుజాతి
పొడ పశువులు
●
నైపుణ్యం కలిగిన పశువులు..
మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి,
తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు )
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం..
నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలువయ్య,
మన్ననూర్, అమ్రాబాద్ మండలం
ప్రత్యేక హోదా కల్పిస్తాం..
నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు.
వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి.
అటవీ సిబ్బందికి రక్షణ సామగ్రి అందజేత
మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు డివిజన్‌తోపాటు జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖలోని 170 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మన్ననూరు రైతువేదిక ప్రాంగణంలో డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర శనివారం రక్షణ సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ముందుండి విధులు నిర్వహిస్తున్న బేస్‌క్యాంపు, యానిమల్ ట్రాకర్స్, పేపర్ పికర్స్, ఫైర్ వాచర్ల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ష్యూస్, జాకెట్లు అందజేశామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన యూఎస్‌టీ సాఫ్ట్‌వేర్ కంపెనీ, సీఎస్‌ఆర్ సంస్థల సహకారంతో సిబ్బందికి అందజేసిన ఈ కిట్లు పెట్రోలింగ్ వన్యప్రాణుల పర్యవేక్షణ, అటవీ సంరక్షణ, అక్రమ కలప నియంత్రణ తదితర విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకించి అన్ని సమయాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ చంద్ర ప్రకాష్ సింఘాల్, ఆయా సంస్థల ప్రతినిధులు మదన్‌రెడ్డి, విశాల్, శ్రీనాథ్, సందీప్, అంకిత్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓలు సవిత, వీరేష్, ఎఫ్‌ఎస్‌ఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్వీయ ఆలోచనలతో..
ఇన్‌స్పైర్ మనక్–2026 విద్యా సంవత్సరంలో భాగంగా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ స్వీయ ఆలోచనలతో రూపొందించిన పరికరాలు, యంత్రాలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణతోపాటు ప్రజలు దైనందిన జీవితానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది.
లోతట్టు అభయారణ్యంలో..
2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బికె)లో ఈ ప్రాంత రైతులు, తెలంగాణ జీవవైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేసింది. అదేవిధంగా పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 వేలకు తగ్గిపోయింది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనే వారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతాల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశు పోషణ భారంగా మారి చాలామంది ఆ వృత్తిని వదులుకుంటున్నారు.
కోడె దూడలకు డిమాండ్
జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 450
ప్రైవేట్ పాఠశాల నుంచి 2 ప్రాజెక్టులు మాత్రమే నమోదు
ప్రతి పాఠశాల నుంచి 5 చొప్పున రావాలని సూచన
క్షేత్రస్థాయిలో చొరవ తీసుకోని ఉపాధ్యాయులు
ఈ నెల 15తో ముగియనున్న గడువు


