ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయాలి

Sep 13 2026 1:18 AM | Updated on Sep 13 2026 1:18 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం పీఆర్‌ శాఖ మంత్రి సీతక్కను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌ గౌరవ వేతనాలు, పంచాయతీ నిధులు విడుదల చేయాలని, విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, మ్యాచింగ్‌ గ్రాంట్లు విడుదల చేయాలని, ఇందిరమ్మ కమిటీలతో సర్పంచ్‌ల అధికారాలను తగ్గించే జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement