విద్యార్థినులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు.


