కందనూలు/ తాడూరు: సమాజంలో మహిళల ఆర్థి సాధికారతే గ్రామీణాభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర మైనార్టీ సంక్షమే శాఖ కార్యదర్శి, జిల్లా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక ప్రత్యేకాధికారి షఫియుల్లా అన్నారు. మంగళవారం ఆయన తాడూరు మండలంలోని ఐతోలు గ్రామంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామ నర్సరీ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కేంద్రం, మహిళా సంఘాల స్నేహ గ్రూపుల కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా షఫియుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి లబ్ధిదారు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. అలాగే అర్హులైన పత్రి కుటుంబానికి ఈ పథకం అందేలా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పిన, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలోని అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


