నేను ఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినాను. ఏదో ప్రభావంతో వర్షాలు రావడం లేదని అందరూ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా. ఎంతైనా వర్షాలు కురిస్తేనే అంతా బాగుంటుంది.
– చంద్రయ్య, తిమ్మాయిపల్లి, చారకొండ
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రైతులు తక్కువ వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంది, మినుము, ఉలవలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలు సాగు చేసుకోవాలి. కాల్వ నీటిపై ఆధారపడే రైతులు వరినాట్లు, నర్సరీలు వేయడం మానుకోవాలి. ఆగస్టు 15 వరకు కాల్వ నీరు అందుబాటులో ఉండదు. ఎల్‌నినోపై రైతులను చైతన్యపరచడంతోపాటు సాగు చేసే పంటలపై గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
●


