కందనూలు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన 241 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో రమణారావు, తీగల సునేంద్ర పాల్గొన్నారు.
మహిళల భద్రతషీటీం బాధ్యత
కల్వకుర్తి టౌన్: మహిళల భద్రత షీ టీం బాధ్యత అని జిల్లా షీ టీం ఇన్‌చార్జి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మహిళా చట్టాలు, మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం తమ ఆటపాటలతో వివిధ సామాజిక అంశాలను వివరించారు. సీసీఎస్ సీఐ శంకర్, కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్, ఎస్‌ఐ కురుమూర్తి పాల్గొన్నారు.
పీజీ సెంటర్‌లోసమస్యలు పరిష్కరిస్తాం
కొల్లాపూర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రిజిస్ట్రార్ రమేష్‌బాబుతో కలిసి ఆయన కొల్లాపూర్ పీజీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సెంటర్‌లో నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం బాలికల, బాలుర వసతి గృహలను, వసతులు, భోజనం పరిశీలించారు. ప్రొఫెసర్లతో కొంతసేపు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని, హాజరు శాతం తక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల సెంటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్‌పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైభవంగా వార్షికబ్రహ్మోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం వేద పారాయణాలు, మూలమంత్ర అనుష్టానాలు, స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన కళాకారులు వాద్య సంగీత కచేరీ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. గోవిందనామంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని చాటింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


