మన్ననూర్: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రాజబాబుతో కలిసి మన్ననూర్ పీవీటీజీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదులు, వాటర్‌ట్యాంకు, డార్మెంటరీ, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. పాఠశాల నిర్వహణలో మార్పు రావాలని.. లేనిచో కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. వారి వెంట ప్రిన్సిపల్ పద్మావతి, సర్పంచ్ మంజుల, రాజారాం, ఉపసర్పంచ్ రమణగౌడ్ ఉన్నారు.


