ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

అమ్రాబాద్‌: మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. సెప్టెంబర్‌ 15వ తేదీలోగా పూర్తిచేయాలని హౌసింగ్‌ పీడీ గోపాల్‌నాయక్‌ సూచించారు. మంగళవారం అమ్రాబాద్‌ మండల కేంద్రంతో పాటు మాధవానిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో పీడీ మాట్లాడారు. దశల వారీగా ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు అందుతున్నాయని.. లబ్ధిదారులు గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. అదే విధంగా రెండో విడత ఇళ్ల మంజూరుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీఈ హరినాయక్‌, ఎంపీడీఓ రామన్న, ఏఈ కృష్ణ ఉన్నారు.

నూనె గింజల సాగుతో అధిక లాభాలు

మన్ననూర్‌: నూనె గింజల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డా.సురేశ్‌ అన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మన్ననూర్‌ రైతువేదికలో నూనె గింజల పంటలపై ఆదివాసీ గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్‌ మండలంలో రైతులు సాగుచేస్తున్న పంటలు, ఆశిస్తున్న లాభాలు తదితర వివరాలను తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, నూగు లు, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతు లకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వాణిజ్య పంటలకు ఏమాత్రం తీసిపోకుండా నూనె గింజల సాగుతో లాభాలు వస్తాయని తెలిపారు. నూనె గింజల సాగుకు అవసరమైన విత్తనాలను సంస్థ తరఫున అందిస్తామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ మహేశ్‌రెడ్డి, సర్పంచ్‌ మంజుల, రాజారాం, ఎంఏ రహీం, రమణ గౌడ్‌, హన్మంత్‌రెడ్డి, ఏఈఓ దేవి పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మన్ననూర్‌: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మన్ననూర్‌లోని ఐటీఐ, ఏటీసీల్లో శిక్షణ కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోపా, డ్రాప్ట్‌మెన్‌ సివిల్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మోటర్‌ మెకానిక్‌ ట్రేడ్‌లతో పాటు ఏటీసీలోని పలు కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 61013 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement